![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -238 లో.... అక్క వరలక్ష్మి వ్రతం చేద్దామని ఇంట్లో వాళ్ళకి చెప్పావ్.. ఎందుకు అక్క అని నర్మదని ప్రేమ అడుగుతుంది. ఎప్పుడు నగల టాపిక్ వచ్చినా కూడా వల్లి అక్క టెన్షన్ పడుతుంది. కదా రేపు వరలక్ష్మి వ్రతానికి వల్లి అక్క నగలు ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా అప్పుడు నగల విషయం బయటపడుతుందని నర్మద అంటుంది. సూపర్ ప్లాన్ అక్క అని ప్రేమ అంటుంది.
వరలక్ష్మి వ్రతం రోజు ముగ్గురు కోడళ్ళు ప్రొద్దున లేచి వాళ్ళ పనులు చేసుకుంటుంటే అన్న తమ్ముళ్లు ప్లాట్ అవుతారు. చందు వచ్చి శ్రీవల్లికి ముద్దు పెడుతాడు. సాగర్ వచ్చి నర్మద నడుం గిల్లుతాడు. ప్రేమ ముగ్గు వేస్తుంటే ధీరజ్ వెళ్తాడు. లవ్ సింబల్ గిసి ఐ ధీమ అని అందులో రాస్తుంది ప్రేమ. ధీమ ఎవరు అని ధీరజ్ అంటాడు. ధీరజ్ ప్రేమ అని చెప్పాలనుకుంటుంది. తర్వాత చెరిపేస్తుంది. అసలు ధీమ ఎవరని ధీరజ్ ఆలోచిస్తాడు.
ఆ తర్వాత అన్నతమ్ముళ్లు వాళ్ళ భార్యలకి చీరలు కొనడానికి షాప్ కి వెళ్తారు. ధీరజ్ నాకు ఇంకా సాలరీ రాలేదని సైలెంట్ గా ఉంటే.. ఇద్దరు కలిసి ధీరజ్ కి కొంత డబ్బు ఇస్తారు. ముగ్గురు కలిసి చీరలు కొనుక్కొని ఇంటికి వెళ్తారు. నర్మదకి సాగర్ చీర ఇస్తాడు కానీ నర్మద కోపంగా ఉంటుంది. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేసానన్నావ్ కదా అని నర్మద అంటుంటే.. సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. తరువాయి భాగం లో పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇంటికి పెద్ద కోడలిని కాబట్టి పీటలపై నేను మా అయన కూర్చుంటామని శ్రీవల్లి అంటుంది. దాంతో ప్రేమ, నర్మద శ్రీవల్లికి దగ్గరగా వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం గొడవ పెట్టుకుంటారోనని వేదవతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |